భారతదేశం, మార్చి 28 -- టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన ఉదారతతో మరోసారి అందరి మనసు గెలుచుకున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఆయనను ప్రతిష్టాత్మక 'ఎన్టీఆర్ అవార్డు'తో గౌరవించడంతో పాటు రూ. 10 లక్షల నగదు పురస్కారాన్ని అందజేసిన సంగతి తెలిసిందే.

అయితే, ఈ మొత్తాన్ని తన సొంతానికి వాడుకోకుండా.. తన కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు (మార్చి 27) సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలకు విరాళంగా ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి.

సామాజిక సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఐదు వేర్వేరు సంస్థలకు చిరంజీవి ఈ ఎన్టీఆర్ అవార్డ్ నగదు రూ. 10 లక్షలను పంపిణీ చేశారు. 'సర్వ్ ఫౌండేషన్'కు చెందిన 30 మంది వృద్ధులను స్వయంగా ఆహ్వానించి, వారికి కొత్త బట్టలు బహుకరించి విందు భోజనం ఏర్పాటు చేశారు.

దీంతో పాటు దృష్టి లోపం ఉన్న వారికి అండగా నిలుస్తున్న 'దేవ్నార్ ఫౌండేషన్...