భారతదేశం, ఆగస్టు 22 -- Naga Babu Plantation Gift To Chiranjeevi Birthday: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఇవాళ (ఆగస్ట్ 22) రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల కోలాహలం మధ్య ఘనంగా జరుగుతున్నాయి. ఈ ప్రత్యేక దినోత్సవాన్ని పురస్కరించుకుని చిరంజీవి సోదరుడు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు (MLC), ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ కొణిదెల నాగేంద్రబాబు హైదరాబాద్‌లోని కోకాపేటలో మొక్కలు నాటి వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు.

చిరంజీవి బర్త్ డే స్పెషల్‌గా తూర్పు గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ కడియం నర్సరీల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన 'కదంబ వృక్షం' (కదంబవాసిని) మొక్కను నాగబాబు నాటారు. ఈ జాతి మొక్కల విశిష్టతను వివరిస్తూ, 1.5 నుంచి 2 సంవత్సరాల వయసున్న ఈ మొక్క త్వరగానే ఏపుగా పెరుగుతుందని చెప్పారు.

ఇది దట్టమైన పచ్చదనాన్ని అందించడమే కాకుండా,...