భారతదేశం, ఏప్రిల్ 18 -- Chiranjeevi On Murali Mohan The Breaking News: మీడియా నేపథ్యంతో రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం "ది బ్రేకింగ్ న్యూస్". తాజాగా ది బ్రేకింగ్ న్యూస్ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ అనౌన్స్‌మెంట్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో ప్రముఖ నటుడు మురళీ మోహన్, బ్యూటిఫుల్ హీరోయిన్ అనన్య నాగళ్ల, వాసుదేవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ది బ్రేకింగ్ న్యూస్ చిత్రానికి పవన్ కడియాల రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఓపెన్ స్కై క్రియేషన్స్ బ్యానర్‌పై హనుమంత్ రెడ్డి, ఉమ గుటూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే, ది బ్రేకింగ్ న్యూస్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శుక్రవారం (ఏప్రిల్ 17) టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. "ఈ సినిమాను చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మురళీ మోహన్ గా...