భారతదేశం, నవంబర్ 16 -- Chiranjeevi Submits Memo To Kishan Reddy: సినీ పరిశ్రమను పట్టిపీడిస్తున్న కృత్రిమ మేధ (AI) దుర్వినియోగం, డీప్‌ఫేక్ భూతంపై మెగాస్టార్ చిరంజీవి నడుం బిగించారు. నటీనటుల ముఖాలు, గొంతులను అనుకరిస్తూ సామాజిక మాధ్యమాల్లో సాగుతున్న డిజిటల్ దోపిడీకి అడ్డుకట్ట వేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సూచన మేరకు, శనివారం (నవంబర్ 14) కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని కలిసిన చిరంజీవి ఈ మేరకు ఒక సమగ్ర వినతిపత్రాన్ని అందించారు. కేంద్ర హోంశాఖతో పాటు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలకు ఉద్దేశించి రాసిన ఈ లేఖ వివరాలను ఆయన సోమవారం (నవంబర్ 16) తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

ఈ నెల 2న కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసానికి వచ్చారు. ఆ సమయంలో చిరంజీవి, రామ్ చరణ్ ...