భారతదేశం, సెప్టెంబర్ 5 -- Chirajeevi OTT: మెగాస్టార్ చిరంజీవి ఓ ఓటీటీ సిరీస్ పై తెగ ప్రశంసలు కురిపించేశారు. చిరుకు నచ్చిన ఆ సిరీసే.. 'జగమే సంగీతం' (Jagame Sangeetham). ఈ మ్యూజికల్ డ్రామా వెబ్ సిరీస్ పై చిరు రివ్యూ తెగ వైరల్ గా మారింది.

చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మించిన జగమే సంగీతం వెబ్ సిరీస్ పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ 8 ఎపిసోడ్ల పవర్‌ఫుల్ మ్యూజికల్ సిరీస్‌ను చిరంజీవి తాజాగా చూశారు. సిరీస్ మేకింగ్, ప్రొడక్షన్ వాల్యూస్, సంగీతం అద్భుతంగా ఉన్నాయంటూ సోషల్ మీడియా వేదికగా చిరు రివ్యూ పోస్ట్ చేశారు.

పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ఈ జగమే సంగీతం సిరీస్ తెరకెక్కింది. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మధుబాల, అక్షయ్, సుస్మితా శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌పై చిరంజీవి చేసిన రివ్యూ ట్వీట...