భారతదేశం, ఆగస్టు 10 -- తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు తగ్గుతున్నాయి. ఈ పరిణామం చికెన్ ప్రియులకు, సామాన్య ప్రజలకు ఉపశమనమనే చెప్పుకోవాలి. గత కొంతకాలంగా ఆకాశాన్నంటి సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయిన చికెన్, గుడ్ల ధరలు ఇప్పుడు ఒక్కసారిగా పడిపోతున్నాయి.

గత నెలలో కేజీ చికెన్ ధర ఏకంగా రూ. 300 వరకు చేరుకుని సగటు వర్గాల బడ్జెట్‌ను తలకిందులు చేసింది. ఆదివారం వచ్చిందంటే చికెన్ షాపునకు వెళ్లాలంటేనే వెనకాడే పరిస్థితి కనిపించింది. అయితే గత కొద్ది రోజుల నుంచి ఈ ధరలు క్రమంగా తగ్గుతుండటంతో.. నాన్-వెజ్ ప్రియులుకు ఊరట లభించనట్లు అయింది.

హైదరాబాద్, విజయవాడ వంటి ప్రధాన నగరాల హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లలో చికెన్ ధరలు ప్రస్తుతం సామాన్యుడికి ఎంతో సానుకూలంగా మారాయి. హైదరాబాద్ జోన్ లెక్కలను పరిశీలిస్తే.. ప్రస్తుతం కేజీ స్కిన్‌లెస్ చికెన్ ధర రూ. 260 నుంచి 27...