భారతదేశం, మార్చి 29 -- గత కొద్ది రోజులుగా చికెన్‌ ధరలు బెంబేలెత్తించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కిలో చికెన్‌ ధర రూ.380 నుంచి రూ.400 వరకు పలికింది. దీంతో చికెన్ కొనాలంటేనే.వణికిపోయారు. చికెన్ బదులు మటన్ కొనేందుకు ఆసక్తి చూపారు. అయితే మళ్లీ చికెన్ షాపులు సందడిగా మారిపోయాయి. కారణం ఒక్కసారిగా ధరలు భారీగా తగ్గిపోయాయి. దీంతో చికెన్ ప్రియులు.. క్యూలు కడుతున్నారు.

కేజీ చికెన్ రూ. 380 వరకు పలకగా. తాజాగా వంద రూపాయలకు పైగా ధర తగింది. దీంతో మళ్లీ అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇవాళ హైదరాబాద్‌లో కిలో చికెన్‌ ధర (స్కిన్ లెస్) రూ.265 నుంచి 270 పలుకుతుంది. అటు జిల్లాల్లోనూ చికెన్‌ ధరలు భారీగా దిగివచ్చాయి. స్కిన్ తో అయితే చికెన్‌ రూ.235 నుంచి రూ.240 వరకు పలుకుతుంది.

ఇక ఏపీలో చూస్తే కిలో చికెన్‌ రూ.300 నుంచి 350 మధ్య పలుకుతోంది. ఒక్కసారిగా చికెన్ ధరలు...