భారతదేశం, ఆగస్టు 11 -- తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లికేషన్ చేయడానికి దరఖాస్తు ప్రక్రియకు చివరి తేదీ లేదని మెుదట ప్రచారం జరిగింది. కానీ తాజాగా ప్రభుత్వం దరఖాస్తుకు డెడ్‌లైన్ విధించింది. ఇతర విషయాల్లో ఎలాంటి మార్పు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. తొలి విడతలో భాగంగా కింది కేటగిరీలకు చెంది అర్హత ఉన్న లబ్ధిదారులకు కొత్త పెన్షన్లను మంజూరు చేయనున్నారు.

ఒంటరి మహిళలు, వితంతు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా (బోదకాలు) బాధితులు, తలసేమియా, సికిల్ సెల్ డిసీజ్, హిమోఫిలియా వంటి రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న బాధితులకు పెన్షన్ రానుంది..

కొత్త పెన్షన్ల మంజూరుకు సంబంధించిన అర్హత నిబంధనల్లో ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు. గతంలో ఉన్న నిబంధనలనే అనుసరిస్తోంది. 2014 నుండి 2018 మధ్య కాలంలో విడుద...