Cheyutha Pensions : చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన తెలంగాణ సర్కార్
భారతదేశం, ఆగస్టు 31 -- రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చే తీపి కబురు అందించింది. చేయూత పథకం కింద నూతనంగా మంజూరు చేయనున్న సామాజిక పింఛన్ల దరఖాస్తు స్వీకరణ గడువును సెప్టెంబర్ 15వ తేదీ వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని త్వరితగతిన దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా 2.50 లక్షల మంది అర్హులకు సామాజిక భద్రతా పింఛన్లను మంజూరు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియను ఈ నెల 9వ తేదీన శ్రీకారం చుట్టింది. అయితే ప్రాథమికంగా నిర్ణయించిన ఆఖరి తేదీ నాటికి వివిధ కారణాల వల్ల చాలామంది అర్హులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఆగస్టు 31వ తేదీని దరఖాస్తు చివరి తేదీగా ప్రభుత్వం పేర్కొంది. ప్రజాప్రతినిధులు, లబ్ధిదారుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.