భారతదేశం, ఆగస్టు 7 -- చాణక్యుని సూత్రాలు ప్రాచీన కాలానికే పరిమితం కావు.. అవి నేటి ఆధునిక జీవితానికి కూడా వర్తిస్తాయి. ఒక వ్యక్తి తన దైనందిన జీవితంలో ఎలా జీవించాలి, సమాజంలో ఎవరితో ఎలా వ్యవహరించాలి అనే విషయాలను చాణక్యుడు తన చాణక్య నీతిలో స్పష్టంగా పేర్కొన్నాడు.

జీవితంలో విజయం, శాంతి, ప్రశాంతతను సాధించడానికి చాణక్యుడు అనేక మార్గదర్శకాలను ఇచ్చాడు. అదేవిధంగా కుటుంబంలోని కొన్ని అంతర్గత విషయాలను మూడో వ్యక్తితో లేదా బయటివారితో ఎన్నడూ పంచుకోకూడదని చాణక్యుడు హెచ్చరించాడు. భావోద్వేగం వల్ల గానీ, మితిమీరిన నమ్మకం వల్ల గానీ ఈ రహస్యాలు బయటపడితే.. భవిష్యత్తులో ప్రమాదాన్ని, అవమానాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఆ ముఖ్యమైన విషయాలు ఏంటో చూద్దాం.

అన్నిటికంటే ముందుగా మీ కుటుంబంలోని అంతర్గత కలహాలను, విభేదాలను ఎవరితోనూ పంచుకోవద్దని చాణక్యుడు చెబుతున్నాడు. ప్రతి ఇం...