భారతదేశం, ఏప్రిల్ 27 -- Self Enumeration Process : రాష్ట్రంలో జనగణన 2027 ప్రక్రియ ప్రారంభమైంది. గతంలో ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చి వివరాలు అడిగి వెళ్లేవారు, కానీ ఈసారి పౌరులే స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే 'సెల్ఫ్ ఎన్యుమరేషన్' (SE) విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ డిజిటల్ ప్రక్రియను ప్రజలు సులభంగా పూర్తి చేసేలా నాలుగు ప్రధాన దశల్లో పోర్టల్‌ను రూపొందించారు. తెలంగాణలో ఈ ప్రక్రియ ఎలా సాగుతుందో తెలిపే పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి..

ముందుగా పౌరులు అధికారిక సెన్సస్ పోర్టల్ (https://se.census.gov.in) లోకి వెళ్లాలి. అక్కడ తమ రాష్ట్రాన్ని (తెలంగాణ) ఎంచుకుని, స్క్రీన్‌పై కనిపించే క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. అనంతరం 'హౌస్‌హోల్డ్ రిజిస్ట్రేషన్' విభాగంలో ఇంటి యజమాని పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి వివరాలను నమోదు చేయాలి. గుర్తుంచుక...