భారతదేశం, ఏప్రిల్ 15 -- 2027 జనాభా లెక్కల కింద స్వీయ గణన ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏప్రిల్ 16 నుంచి రెండు దశల్లో డిజిటల్ ఫార్మాట్‌లో ప్రారంభమవుతుందని సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ జె.నివాస్ తెలిపారు. మొదటి దశలో మానవ వనరులు, లాజిస్టికల్ అవసరాలను అంచనా వేయడానికి.. ఇళ్లు, భవనాలను లెక్కించడం ద్వారా గృహాల జాబితా జరుగుతుందని అన్నారు.
2027 జనాభా గణన ప్రక్రియ మొత్తం డిజిటల్‌గా నిర్వహిస్తారు. ఇది డేటా సేకరణ, ప్రాసెసింగ్‌లో ఒక ముఖ్యమైన మార్పును సూచిస్తుందని నివాస్ తెలిపారు. 'ఆంధ్రప్రదేశ్‌లో 2027 జనగణన ప్రక్రియ ఏప్రిల్ 16 నుంచి రెండు దశల్లో ప్రారంభమవుతుంది. హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్, జనాభా గణన అనే రెండు దశల్లో డిజిటల్ విధానంలో నిర్వహిస్తారు.' అని సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నివాస్ వెల్లడించారు.
జనాభా గణన అనేది దేశంలో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.