భారతదేశం, మార్చి 3 -- సీబీఎస్ఈ 10, 12 తరగతుల బోర్డు పరీక్షలకు ఆటంకాలు తప్పడం లేదు. పలు కారణాలతో బోర్డు పరీక్షలు మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఇబ్బందులు ఉన్న ప్రదేశాల్లో బోర్డు పరీక్షలు వాయిదా వేస్తూ ఉంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 5, 6 తేదీల్లో కొన్ని సెంటర్లలో జరగాల్సిన పరీక్షల్ని వాయిదా వేస్తూ ఆదేశాలు ఇచ్చింది సీబీఎస్ఈ.

భారత్‌‌తోపాటు 26 దేశాల్లో సీబీఎస్ఈ ఏడాది 10, 12 తరగతులకు బోర్డు పరీక్షలు నిర్వహిస్తోంది. 46 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల కారణంగా అక్కడ బోర్డు పరీక్షలకు ఆటంకాలు కలుగుతున్నాయి.

పశ్చిమాసియాలో కొనసాగుతున్న పరిస్థితుల కారణంగా దృష్ట్యా మార్చి 5, 6 తేదీల్లో జరగాల్సిన 10, 12 తరగతుల బోర్డు పరీక్షలను అనేక గల్ఫ్ దేశాలలో వాయిదా వేసినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సె...