భారతదేశం, మార్చి 31 -- సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2026 నాటి 10వ తరగతి రెండో విడత బోర్డు పరీక్షలకు సంబంధించి ఒక ముఖ్యమైన నోటీసును విడుదల చేసింది. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల జాబితా (List of Candidates - LOC) సమర్పణకు సంబంధించి బోర్డు స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది. ఈ మేరకు పూర్తి వివరాలను సీబీఎస్‌ఈ తన అధికారిక వెబ్‌సైట్ cbse.gov.in లో అందుబాటులో ఉంచింది.

అధికారిక నోటీసు ప్రకారం.. 10వ తరగతి రెండో బోర్డు పరీక్షకు సంబంధించిన ఎల్‌ఓసీ సమర్పణ ప్రక్రియను బోర్డు మొత్తం 3 దశలుగా విభజించింది.

ఎల్‌ఓసీ సమర్పించి, పరీక్ష ఫీజు చెల్లించిన తర్వాత కూడా ఎవరైనా విద్యార్థి రెండో బోర్డు పరీక్షకు హాజరుకాకూడదని భావిస్తే బోర్డు వారికి ఒక వెసులుబాటు ఇచ్చింది. అటువంటి విద్యార్థుల ఫలితాలను ప్రకటించడానికి ప్రధాన పరీక్షలో చూపిన ప్రతిభనే బోర్...