భారతదేశం, జూన్ 1 -- భారత ఆటోమొబైల్ మార్కెట్​లో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కార్ల మధ్య పోటీ రసవత్తరంగా మారింది! టాటా మోటార్స్ ఇటీవల విడుదల చేసిన టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్.. తన ఐసీఈ (పెట్రోల్) మోడల్ కంటే భిన్నమైన, సరికొత్త డిజైన్‌తో మార్కెట్​లోకి వచ్చింది. మరోవైపు అఫార్డిబుల్​ ధరలో, సిటీ రైడ్​కి ఉపయోగపడే విధంగా రూపొందించిన ఎంజీ కామెట్​ ఈవీకి కూడా మంచి క్రేజ్​ ఉంది. ఈ నేపథ్యంలో తక్కువ బడ్జెట్‌లో ఎలక్ట్రిక్​ కారు కొనాలనుకునే వారి కోసం టాటా టియాగో ఈవీ బేస్ వేరియంట్ 'స్మార్ట్ 19', దానికి గట్టి పోటీగా ఉన్న ఎంజీ కామెట్ ఈవీ బేస్ వేరియంట్ 'ఎగ్జిక్యూటివ్' ధరలు, రేంజ్​, ఛార్జింగ్ ఫీచర్ల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకోండి..

ఈ స్కీమ్ కింద కారు కొనేటప్పుడు బ్యాటరీ ధరను మినహాయించి కేవలం కారు బాడీకి మాత్రమే డబ్బులు చెల్లిస్తారు. దీనివల్ల కారు ప్రార...