భారతదేశం, ఆగస్టు 28 -- కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను పూర్తి చేసుకుంటున్న వేళ, ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రభుత్వంపై ప్రజా పోరాటానికి సిద్ధమైంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను నిలబెట్టుకోకుండా ప్రజలను మోసం చేసిందంటూ కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఏడు రోజుల పాటు వినూత్న నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 2 నుండి 8 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ నిరసన బాట సాగనుంది.

పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. వంద రోజుల్లోనే హామీలన్నీ నెరవేరుస్తామని మాటిచ్చి, వెయ్యి రోజులు దాటినా ప్రధాన వాగ్దానాలను గాలికి వదిలేశారని ఆయన విమర్శించారు. ఈ పాలనా వైఫల్యాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లి ప్రజలను చైతన్యవంతం చేయడమే ...