భారతదేశం, ఏప్రిల్ 13 -- రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఓవైపు ప్రభుత్వం పోరాటం చేస్తున్న ప్రతిపక్ష బీఆర్ఎస్.. మరోవైపు క్షేత్రస్థాయిలో బలోపేతం అయ్యే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవలే సీనియర్ నేత జీవన్ రెడ్డితో సంప్రదింపులు జరిపి. పార్టీలోకి తీసుకువచ్చేందుకు లైన్ క్లియర్ చేసింది. ఇప్పటికే ఆయన కేసీఆర్ తో భేటీ కాగా.. అధికారికంగా బీఆర్ఎస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు.

జీవన్ రెడ్డి పార్టీలో చేరిక సందర్భంగా జగిత్యాల కేంద్రంగా(మోతె) భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఇందుకు ఈనెల 20వ తేదీని ముహుర్తంగా ఫిక్స్ చేశారు. ఈ సభకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ హాజరవుతారు. కేసీఆర్ సమక్షంలోనే జీవన్ రెడ్డి పార్టీలో చేరనున్నారు.

జగిత్యాల జిల్లా కేంద్రంలో తలపెట్టిన ఈ భారీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి....