భారతదేశం, జూన్ 11 -- Brown Web Series Review: కోల్‌కతా నగరం అంటే అందరికీ గుర్తుకు వచ్చేది విక్టోరియా మెమోరియల్, టీ అడ్డా, పసుపు రంగు టాక్సీలు. కానీ డైరెక్టర్ అభినయ్ డియో ఈ బ్రౌన్ వెబ్ సిరీస్ కోసం కోల్‌కతాను ఒక భయంకరమైన డార్క్ వరల్డ్ గా మార్చేశారు.

అభిక్ బారువా రాసిన 'సిటీ ఆఫ్ డెత్' నవల ఆధారంగా జీ5 ఓటీటీలోకి వచ్చిన ఈ 7 ఎపిసోడ్ల వెబ్ సిరీస్ 'బ్రౌన్' ఓ పవర్ ఫుల్ క్రైమ్ థ్రిల్లర్. కానీ స్క్రీన్ ప్లే లోపాల వల్ల కాస్త నిరాశ కలిగిస్తుంది.

ఈ వెబ్ సిరీస్ మొదట్లోనే కోల్‌కతా నగరంలోనే అత్యంత ధనవంతురాలైన అహానా జైస్వాల్ దారుణంగా హత్యకు గురవుతుంది. ఆమెను తన సొంత ఇంట్లోనే తల నరికి దారుణంగా హత్య చేయడం నగరంలో కలకలం రేపుతుంది. ఈ కేసును డీల్ చేసే బాధ్యతను డీసీపీ రీటా బ్రౌన్ (కరిష్మా కపూర్)కు అప్పగిస్తారు.

రీటా బ్రౌన్ ఒకప్పుడు తెలివైన ఆఫీసరే. కానీ తన భర్తన...