భారతదేశం, సెప్టెంబర్ 12 -- భారత రాజధాని దిల్లీ వేదికగా శనివారం అత్యంత కీలకమైన 'బ్రిక్స్' (BRICS) దేశాల వార్షిక శిఖరాగ్ర సదస్సు ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన వేళ, ఇంధన మార్కెట్లలో అనిశ్చితి, అంతర్జాతీయ నౌకా రవాణా ఆటంకాలు, సరఫరా గొలుసుల (సప్లై చైన్) నిలిపివేత సవాళ్ల నడుమ ఈ భేటీ జరుగుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

దిల్లీలో బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో అసలు బ్రిక్స్ అంటే ఏంటి? బ్రిక్స్ ఎందుకు ఏర్పడింది? దీని చరిత్రేంటి? ఇప్పటివరకు ఏం సాధించింది? బ్రిక్స్​ ఎదుర్కొంటున్న సవాళ్లేంటి? వాటి పూర్తి వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

2001లో గోల్డ్‌మ్యాన్ సాచ్స్ సంస్థ ప్రధాన అర్థశాస్త్రవేత్త జిమ్ ఓ నీల్ 'బ్రిక్' (బీఆర్​ఐసీ - బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా) అనే పదాన్ని ప్రయోగాత్మకంగా తెరపైకి త...