భారతదేశం, జూలై 6 -- ప్రపంచ ఫుట్‌బాల్‌లోనే అత్యంత విజయవంతమైన జట్టుగా పేరొందిన బ్రెజిల్‌కు ఊహించని పరాభవం ఎదురైంది. అమెరికా ఆతిథ్యమిస్తున్న 2026 ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన ఉత్కంఠభరితమైన రౌండ్ ఆఫ్ 16 పోరులో నార్వే 2-1 తేడాతో బ్రెజిల్‌ను మట్టికరిపించి క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. 1990 తర్వాత ప్రపంచకప్ చరిత్రలో బ్రెజిల్ ఇంత త్వరగా టోర్నీ నుంచి నిష్క్రమించడం ఇదే మొదటిసారి. ఓటమి అనంతరం ఇంటర్నేషనల్​ ఫుట్​బాల్​కి విడ్కోలు పలుకుతున్నట్టు బ్రెజిల్​ స్టార్ ప్లేయర్ నెయ్​మర్ ప్రకటించాడు.

నార్వే స్టార్ స్ట్రైకర్ ఎర్లింగ్ హాలాండ్ తన అద్భుత ఆటతీరుతో బ్రెజిల్ డిఫెన్స్‌ను ముక్కలు చేశాడు. ఈ మ్యాచ్‌లో సాధించిన రెండు గోల్స్‌తో కలిపి ఈ టోర్నీలో హాలాండ్ మొత్తం 7 గోల్స్ పూర్తి చేసుకున్నాడు. తద్వారా లియోనల్ మెస్సి, కిలియన్ ఎంబాపె సరసన నిలిచాడు.

మరోవై...