భారతదేశం, సెప్టెంబర్ 21 -- డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) విద్యార్థులకు అద్భుతమైన అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. కాలపరిమితి ముగిసిపోయి, ఇంకా డిగ్రీ పూర్తి చేయలేకపోయిన పాత బ్యాచ్‌ విద్యార్థుల కోసం ప్రత్యేక రీ-అడ్మిషన్ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు విశ్వవిద్యాలయం అధికారికంగా ప్రకటించింది. డిగ్రీ , సీబీఎస్సీ పాత విధానంలో చదివి సబ్జెక్టులు మిగిలిపోయిన అనేకమంది విద్యార్థుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని వర్సిటీ పాలకవర్గం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ ప్రత్యేక రీ-అడ్మిషన్ ప్రక్రియ ద్వారా 1990 నుంచి 2014వ సంవత్సరం మధ్య వర్సిటీలో చేరి, వివిధ కారణాల వల్ల డిగ్రీ పూర్తి చేయలేకపోయిన విద్యార్థులందరూ లబ్ధి పొందవచ్చు. నిర్ణీత రుసుము చెల్లించి, నిబంధనలకు అనుగుణంగా అడ్మిషన్ పొంది తమ పెండింగ్ బ్యాక్‌లాగ్ పరీక్షలు రాసేందుక...