భారతదేశం, జూలై 16 -- BRAOU New Courses : దూర విద్యలో చదువుకోవాలనుకునే వారికి హైదరాబాద్ లోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) మరో తీపి కబురు అందించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను చేరువ చేసేలా ఐదు కీలక కోర్సుల నిర్వహణకు యూజీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఐదు కోర్సులకు ప్రొఫెషనల్, అకాడమిక్ రంగాల్లో విపరీతమైన డిమాండ్ ఉందని వర్సిటీ వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ఓ ప్రకటనలో వెల్లడించారు.

ఈ ఏడాది జూన్ నెలలో యూజీసీ నిపుణుల కమిటీ వర్చువల్ పద్ధతిలో విశ్వవిద్యాలయాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసింది. వర్సిటీలో ఉన్న అత్యాధునిక మౌలిక వసతులు, అధ్యాపక సిబ్బంది నైపుణ్యాలు, ఇతర విద్యా ప్రమాణాలను పరిశీలించిన అనంతరం ఈ ప్రోగ్రామ్స్‌కు తుది ఆమోదం తెలిపింది.

ఈ కొత్త కోర్సుల రూపకల్పనలో తెలంగాణ ప్రభుత్వం పూర...