భారతదేశం, సెప్టెంబర్ 30 -- BRAOU MCA Admissions 2026 : హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (MCA) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఈ గడువు ఈనెల 28వ తేదీతో ముగియగా. అధికారులు గడువు పొడిగించారు. ఈ మేరకు ప్రకటన జారీ అయింది.

2026-27 విద్యా సంవత్సరానికి గానూ ఎంసీఏ ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే చివరి తేదీని అక్టోబర్ 10, 2026 వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సాంకేతిక విద్యను అభ్యసించాలనుకునే అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

ఎమ్‌సీఏ ప్రవేశ పరీక్షకు హాజరుకావాలనుకునే అభ్యర్థులు నిర్దేశిత విద్యా అర్హతలు కలిగి ఉండాలి. అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ స్థాయిలో తప్పనిసరిగా గణితం ఒక సబ్జెక్టుగ...