భారతదేశం, అక్టోబర్ 13 -- డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో చేరేందుకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ్టితో గడువు పూర్తి కానున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించగా... ఇక పొడిగించే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇదే చివరి అవకాశమని పేర్కొన్నారు.

ఈ ప్రవేశాల ప్రక్రియలో భాగంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులైన బీఏ , బీకామ్ , బీఎస్సీ లతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులైన ఎంఏ , ఎంకామ్, ఎంఎస్సీ , ఎంబీఏ , బీఎల్ఐఎస్సీ , ఎమ్ఎల్ఐఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు. వీటితో పాటు పల...