భారతదేశం, మార్చి 8 -- బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో ఇందుకు, ఐశ్వర్యకు ఒకే గదిలో ఎగ్జామ్ జరుగుతుంది. ఇందు మాస్క్ పెట్టుకుని ఉంటే ఫొటో ఐడెంటిఫై చేయాలని ఇన్విజిలేటర్ అంటాడు. దాంతో కాసేపు తటాపటాయించిన తర్వాత ఐశ్వర్యకు కనిపించకుండా కేవలం ఇన్విజిలేటర్‌కు మాత్రమే కనిపించేలా తన ముఖాన్ని మాస్క్ తీసి చూపిస్తుంది ఇందు.

దాంతో ఇందును ఎగ్జామ్ రాయడానికి ఇన్విజిలేటర్ ఒప్పుకుంటాడు. తీసుకొచ్చిన స్లిప్స్ చూస్తూ ఐశ్వర్య పరీక్ష రాస్తుంటుంది. అది చూసిన ఇన్విజిలేటర్ ఐశ్వర్యను లేపి కొప్పడతాడు. నేను ముందే చెప్పాను స్లిప్స్ ఉంటే పడేయమని, ఈసారి స్క్వాడ్ చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారని అరుస్తాడు ఇన్విజిలేటర్.

ఎవరికీ చెప్పకండి సర్ అంటూ ముందుగా బతిమిలాడుతుంది ఐశ్వర్య. అయిన ఇన్విజిలేటర్ ఒప్పుకోకపోవడంతో రివర్స్ అవుతుంది ఐశ్వర్య. తన ఇంటి గొప్పతనం గురించి ...