భారతదేశం, అక్టోబర్ 27 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రాజు, ఇందు డాక్టర్ వేషంతో నటించే యాక్టర్‌ను కలుస్తారు. వెంకీ మేనేజర్‌తో నిజం రాబట్టేందుకు ప్లాన్ వేస్తారు. నేను వాడితో మాట్లాడుతున్నప్పుడు అదంతా వీడియో తీయమని యాక్టర్‌కి చెబుతాడు రాజు.

రెస్టారెంట్‌లో వెంకీ మేనేజర్‌ను కలుస్తారు రాజు, ఇందు. రేపు డీల్ గురించి ఆఫీస్‌లో మాట్లాడుకుందామని రాజు అంటాడు. ఈరోజుల్లో డబ్బు చుట్టూనే బంధాలన్నీ తిరుగుతున్నాయని మేనేజర్ చెబుతాడు. మీరు డీల్ కరెక్ట్‌గా ఫినీష్ చేయగలరా. మాకేం సమస్య రాదుగా అని రాజు అడుగుతాడు. ఐశ్వర్యకు డీల్ చేసింది నేనే. ఆ దుగ్గిరాల ఇంట్లో ఫ్రాడ్ ఎవరైనా ఉన్నారంటే ఐశ్వర్య. పక్కా 420 మెటీరియల్. మీ అక్క గురించి చెబుతున్నందుకు సారీ అని మేనేజర్ అంటాడు.

ఐశ్వర్యను ఎలా కాపాడారు అని రాజు అడుగుతాడు. అది చెప్ప...