భారతదేశం, నవంబర్ 2 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రాజు వెళ్తుంటే.. చలపతి అడ్డుకుంటాడు. ఆఫీస్‌కి వెళ్తున్నా. ఒక్క సంతకం చేసి వస్తాను. నీకోసం తనను కాదనుకున్నా. నావల్ల కంపెనీకి నష్టాలు రాకూడదు అని రాజు చెబుతాడు. దాంతో చలపతి సైలెంట్‌గా వెళ్లిపోతాడు.

మరోవైపు రాజు వస్తే ఎలా మాట్లాడాలని ఇందు కంగారుపడుతుంటే నేనున్నాగా అని డిజైనర్ ప్రశాంత్ అంటాడు. ఇంతలో రాజు వస్తాడు. ఇందు వెళ్లి చూస్తుంది. రాజు, ఇందు ఎదురుపడతారు. సంతకం ఎక్కడ పెట్టాలని రాజు అడిగితే.. పేపర్ మీద, కాఫీ ఏమైనా తీసుకురావాలా అని ప్రశాంత్ అంటాడు. రాజు వార్నింగ్ ఇస్తాడు.

ఒక్క మాట కూడా మాట్లాడాలని ఇందు అనుకుంటుంది. మనిద్దరం కలిసి సర్ మీద దండయాత్ర చేద్దామని ప్రశాంత్ అంటాడు. సర్వర్ డౌన్ అయింది, నెట్‌వర్క్ ఫెయిల్ అయిందంటూ సిల్లీ రీజన్స్ చెప్పి సర్ సాయ...