భారతదేశం, మే 7 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రేఖ కొడుకు మదన్‌ను భ్రమరాంబ కూతురు స్వాతి ప్రేమిస్తున్నట్లు ఇందుకు చెబుతుంది. రేపు గుడిలో నా పెళ్లి జరగదు. నీ ప్రేమను ఎప్పటికీ ఓడిపోనివ్వను అని ఇందు అంటుంది. నేను నిన్ను నమ్మలేను. అవతల రేఖ ఆంటీ ఉందని స్వాతి అంటే.. కావచ్చు. కానీ, ఇవతల ఓ కంత్రీ (రాజు) గాడు ఉన్నాడని ఇందు అంటుంది.

మరోవైపు ఆ 10 లక్షలు దేనికి వాడావురా, పంజాగుట్ట హాస్పిటల్‌కి ఎందుకు వెళ్లావ్. నీ జీవితంలో సీక్రెట్స్ లేవనుకున్నా. ఆ 10 లక్షలు ఇచ్చి ఐశ్వర్యతో లైఫ్ సెటిల్ చేసుకుందామనుకున్నా. కానీ నీ స్వార్థం నువ్వు చూసుకుంటావనుకోలేదని లక్కీ అంటాడు. దాంతో కోప్పడిన రాజు ఏంట్రా స్వార్థం, ఇదేనా అర్థం చేసుకుందని రాజు అంటాడు. అవునురా, మరి ఆ పది లక్షలు ఏం చేశావో చెప్పు. నన్ను పరాయివాడిని చేస్తున్నావా. స...