భారతదేశం, మే 14 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో చలపతి ఇంటికి వెళ్లిన అపర్ణ తన ఫ్యామిలీ యాక్సిడెంట్, కూతురు గురించి, రాజు తన కొడుకులా ఉండటం గురించి చెబుతుంది. మీ అబ్బాయి రాజును చూడగానే నా మనవడిలాగే అనిపించిందని కన్నీళ్లు పెట్టుకుంటుంది అపర్ణ.

రాజు మీ కన్నకొడుకు కాదు కదా, తనను మీరు పెంచుకుంటున్నారు కదా. అందరిని పోగొట్టుకున్నాను. జీవితంలో కన్నీళ్లు తప్పా ఇంకేం మిగల్లేదు. తను మీ ఇంటి బిడ్డ కాదు కదా, దుగ్గిరాల వారసుడు కదా, దయచేసి నిజం చెప్పండి, చేతులెత్తి దండం పెడుతున్నా. దయచేసి నిజం చెప్పండి అని ఏడుస్తూ అపర్ణ అడుగుతుంది.

శ్రుతి చెప్పిన మాటలు గుర్తు చేసుకున్న చలపతి రాజు తన కొడుకు, మా ఇంటి వారసుడు అని అబద్ధం చెబుతాడు. మీరెందుకో అబద్ధం చెబుతున్నారనిపిస్తోందని అపర్ణ అంటుంది. అనుకోకుండా వాడి పోలికలు కలిశా...