భారతదేశం, మార్చి 27 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ఇంట్లో అందరూ ఇందు కోసం ఎదురుచూస్తుంటారు. ఇంతలో ఇందు వస్తుంది. ఎందుకు చేశావ్ ఈ పని అని రేఖ అడిగితే.. దేని గురించి అడుగుతున్నారు అని ఇందు అంటుంది.

రెండు నెక్లెస్‌ల దొంగతనం ఎందుకు చేశావ్. నా వస్తువులను తాకే ధైర్యం ఎలా వచ్చిందని రేఖ అంటుంది. నేను ఏ దొంగతనం చేయలేదు. వంట చేసి ఇప్పుడే వస్తున్నా అని ఇందు అంటుంది. ఇలా నార్మల్‌గా అడిగితే ఎలా చెబుతుంది అని భ్రమరాంబ, ఐశ్వర్య అంటారు. ఇద్దరు కలిసి పాపం ఇందును బలి పశువును చేస్తున్నారుగా అని తిట్టుకుంటాడు శేషు.

తాతయ్య ఆపరేషన్ కోసం చేసి ఉంటావని ఐశ్వర్య అంటే.. అది నిజమే కానీ, దానికోసం ఇంతలా దిగజారతానా, నా గురించి మీకు తెలియదా నా గురించి అని ఇందు అంటుంది. అయినా రేఖ నమ్మదు. నువ్వు చేసిన ఈ పనికి వాళ్లకు శిక్ష వేస్...