భారతదేశం, మార్చి 24 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ఇందు చేసిన వంట బాగా లేదని కావాలనే వంకలు పెడతారు. అపర్ణను రెచ్చగొట్టేలా నానా మాటలు అంటారు. కనీసం సాంబారు అయిన బాగా చేశావా అని రేఖ అంటే చేశాను అని వడ్డించబోతుంది ఇందు. కావాలనే ఇందుకు భ్రమరాంబ కాలు అడ్డం పెడుతుంది.

దాంతో ఇందు కిందపడిపోతుంది. రేఖ చీరపై సాంబారు పడుతుంది. అపర్ణ వచ్చి ఇందును లేపుతుంది. ఈ మాత్రం బరువు మోయలేవా, రేఖ కాస్ట్‌లీ చీర పాడైపోయేది అని తిడుతుంది భ్రమరాంబ. కింద పడిన సాంబార్ ఇప్పుడే క్లీన్ చేయమంటుంది రేఖ. దాంతో ఇందు క్లీన్ చేస్తుంది. శుభ్రం చేస్తుంటే అన్నం తింటూ ఇందు మొహానికి కాలు పెడుతుంది రేఖ.

అది చూసి అపర్ణ ఆవేశంతో ఊగిపోతుంటే.. ఇందు వద్దని వారిస్తుంది. కాలు ఆడిస్తూ ఇందును అవమానిస్తుంది రేఖ. తుడిచింది చాలు ఇక వెళ్లమని చెబుతుంది...