భారతదేశం, ఆగస్టు 31 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో లక్కీని పసిగుడ్డుగా ఉన్నప్పుడు విసిరేసిన మహాతల్లి ఎవరో కాదు రేఖ పిన్నీనే అని రాజు చెబుతాడు. లక్కీ మీ అమ్మ రేఖ పిన్నీయేరా అని రాజు అంటాడు. అంతా అబద్ధం అని మదన్ అంటే.. రేయ్ మీ అమ్మ రెండు తప్పులు చేసింది. ఒకటి లక్కీని కనడం, రెండోది అనాథను చేయడమని రాజు అంటాడు.

ఇన్ని రోజులు రేఖ పిన్ని చెబుతుందని చూశాను. చెప్పకపోయేసరికి నేనే చెప్పాను అని రాజు అంటాడు. రేఖ కొడుకు కాబట్టే లక్కీని ఈ ఇంట్లో పెట్టావా అల్లుడు అని శేషు అంటే.. అవును అని రాజు అంటాడు. లేదు అబద్ధం, నీ పెళ్లి గురించి నిజాన్ని తప్పించేందుకు ఇదంతా చేస్తున్నావని భూషణ్, భ్రమరాంబ అంటారు. దాంతో డీఎన్ఏ రిపోర్ట్స్ అందరికి చూపిస్తాడు రాజు.

రేఖను మదన్ అడుగుతాడు. రిపోర్ట్స్ ఏంటీ లక్కీ నీ కొడుకు అని చెబుతున్న...