భారతదేశం, ఆగస్టు 21 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో లక్కీ, రేఖల డీఎన్ఏ రిపోర్ట్ వస్తుంది. ఇందును పైనుంచి చూడమని రాజు అంటాడు. పక్కనే భూషణ్ టిఫిన్ చేస్తుంటాడు. మరోవైపు ఇక నాకు ఎలాంటి భయాలు లేవని రేఖ సంతోషిస్తుంది. రేఖ దగ్గరికి రాజు వెళ్తాడు. కాసేపు నీ మొహంలో ఉన్న సంతోషం పోతుందిలే అంటాడు రాజు.

ఈరోజు నీ గతం బ్లాస్ట్ అయిపోతుంది. ఈ ఇంట్లో ఉన్నవాళ్లందరికి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. నిజంగానే లక్కీ నీ కొడుకు అందరికి తెలిసిపోతుంది. లక్కీ నీ కొడుకు అనడానికి ఎలాంటి సాక్ష్యం లేదని తెగ బాధపడిపోయావుగా. అది సంపాదించాను. అది నువ్వే ఇచ్చావ్. నేనేం పీకలేనని నా మొహానా వెంట్రుక విసిరేసావుగా. ఆ వెంట్రుకతోనే డీఎన్ఏ టెస్ట్ చేయించాను. రిపోర్ట్ వచ్చిందని రాజు చెబుతాడు.

దాంతో రేఖ షాక్ అవుతుంది. మనుషులను మాయం చేయొచ్చుగానీ బ్...