భారతదేశం, ఆగస్టు 10 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో లక్కీకి పెళ్లి చూపులు జరుగుతుంటాయి. పెళ్లి కొడుకు వచ్చాడుగా ముసుగు తీయవా అని శేషు అడిగితే.. పెళ్లికూతురు తీస్తుంది. ముసుగు తీయకుంటేనే బాగుండేది అని శేషు మనసులో అనుకుంటాడు.

పెళ్లికూతురుని లక్కీని చూడమని రాజు బలవంతం చేస్తాడు. ఐషును తప్పా ఇంకెవరిని చూడనని లక్కీ అంటే.. బలవంతంగా చూపిస్తాడు రాజు. తర్వాత లక్కీ అమ్మనాన్న గురించి అడుగుతుంది పెళ్లికూతురు తల్లి. రేఖవైపు చూస్తాడు రాజు. అందరిగురించి చెప్పారు గానీ తల్లిదండ్రుల గురించి చెప్పలేదని అడుగుతారు పెళ్లిచూపుల వాళ్లు.

ఉంటే కదా చెప్పడానికి అని భ్రమరాంబ అంటుంది. మావోడికి అమ్మనాన్న లేరండి. చనిపోయారో లేదో తేలియదండి. వాళ్ల అమ్మ ఎవరో వాడికి తెలియదండి. వాడికే కాదు మాకు ఎవరికి తెలియదని రాజు అంటాడు. అమ్మ ఎవరో త...