భారతదేశం, ఏప్రిల్ 23 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రాత్రిపూట రాజ్‌ను బయటకు తీసుకువెళ్లమన్న ఇందు దొంగతనం చేసి ఐస్‌క్రీమ్ తినాలంటుంది. అందుకు ముందు రాజ్ ఒప్పుకోడు. డల్లాస్ కాంతారావు దగ్గర తేల్చుకుందామని ఇందు అనడంతో రాజ్ ఒప్పుకుంటాడు. తనే దొంగతనం చేసి ఐస్‌క్రీమ్ తినాలని చెబుతుంది ఇందు.

కాసేపు వాదించిన రాజ్ తర్వాత ఒప్పుకుంటాడు. ఇందు, రాజ్ ఐస్‌క్రీమ్ బండి వాడి దగ్గరికి వెళ్లి ఐస్‌క్రీమ్ కొట్టేస్తుంది ఇందు. దాంతో ఇందు సంతోషిస్తుంది. నీ చిన్నప్పటి డ్రీమ్ నెరవేరిందిగా అని రాజ్ అంటాడు. ఇద్దరు చెరో ఐస్‍క్రీమ్ తింటారు. రాజ్ ఐస్‌క్రీమ్ వెంటనే తినేస్తాడు. అదేంటీ కక్కుర్తిలా వెంటనే తినేసావ్, నీకు ఇంకోటి తినాలని ఉందిగా. పదా ఇంకోటి కొట్టేద్దాం అని ఇందు అంటుంది.

మళ్లీ వాడి దగ్గరికి వెళ్తే దొరుకుతాం అని రాజ్ అంట...