భారతదేశం, ఏప్రిల్ 10 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో లాయర్లతో రేఖ మీటింగ్ నిర్వహిస్తుంది. ఇందుతో సంతకం అందరి ముందు పెట్టించాలని, దాన్ని వీడియో తీసుకుని భవిష్యత్తులో ప్రూఫ్ కింద వాడుకోవచ్చని ఓ లాయర్ చెబుతాడు. రేఖను ఎదురించే ధైర్యం ఎవరు చేయరులేండి అని భ్రమరాంబ అంటుంది.

ఇంతలో రేఖకు శ్యామ్ అనే అతను కాల్ చేసి తమ రిపోర్టర్ నుంచి ఓ ఇన్ఫర్మేషన్ వచ్చిందని. మీ ఇంట్లోనుంచి ఒకరు కాల్ చేసి ఇందుతో బలవంతంగా సంతకం పెట్టించుకుంటున్నారని, ఇందుకు మీడియా అంతా సపోర్ట్ చేయాలని కోరారు. ఈ న్యూస్ అన్ని ఛానెల్స్‌కు వెళ్లిపోయింది. నేను ప్రెసిడెంట్ కాబట్టి అందరూ నాకు కాల్ చేసి అడుగుతున్నారు. ఒక్కసారి ఈ విషయం పబ్లిక్ అయిందంటే ఎవరు ఏం చేయలేరు అని అతను చెబుతాడు.

నేను ఈ విషయాన్ని హ్యాండిల్ చేస్తాను, రిపోర్టర్స్‌ను మీరు ఆపండి, అ...