Botcha Emotional : కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం - కన్నీటిపర్యంతమైన మాజీ మంత్రి బొత్స!
భారతదేశం, సెప్టెంబర్ 10 -- విజయనగరం జిల్లా గరివిడిలోని క్యాంప్ కార్యాలయంలో చీపురుపల్లి నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలతో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ 'ఆత్మీయ కలయిక' కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను గుర్తు చేసుకుంటూ ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అంతేకాదు ఒక్కసారిగా భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు.
కార్యకర్తలను ఉద్దేశించి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. "రాజకీయాల్లో నాయకులు లేదా వ్యక్తులు రావొచ్చు, వెళ్లిపోవచ్చు. కానీ మనం ప్రాణంగా భావించే పార్టీ ఎప్పటికీ శాశ్వతం. కాబట్టి ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. చీపురుపల్లి నియోజకవర్గంలో మనమంతా ఒకే కుటుంబంలా కలిసికట్టుగా ఉండాలి," అని దిశానిర్దేశం చేశారు. పార్టీ అధినేత జగన్ ఆశయాల సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపుని...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.