Bonalu Panduga : బోనమెత్తిన భాగ్యనగరం.. లాల్ దర్వాజాలో ఆధ్యాత్మిక శోభ
భారతదేశం, ఆగస్టు 9 -- భాగ్యనగరంలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. పాతబస్తీలోని ప్రసిద్ధ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా నడుస్తోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తడంతో హైదరాబాద్ నగరం ఆధ్యాత్మిక శోభతో వికసిస్తోంది. డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, జోగినుల నృత్యాలతో పాతబస్తీ వీధులన్నీ కోలాహలంగా మారాయి.
ఉదయం 4:30 గంటలకే ఆలయ తలుపులు తెరిచి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి తొలిబోనాన్ని సమర్పించి ఉత్సవాలను ప్రారంభించారు. రాత్రి 10:30 గంటల వరకు భక్తులు అమ్మవారికి బోనాలు, ఒడిబియ్యం, పట్టువస్త్రాలు, చీర, సారె సమర్పించేందుకు అనుమతి ఉంటుంది. సాయంత్రం వేళ అమ్మవారి శాంతి కళ్యాణం మహోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది.
బోనాల జాతర సందర్భంగా పలు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.