Bonalu jatara Traffic : బోనాల పండుగ.. హైదరాబాద్లో ట్రాఫిక్ మళ్లింపులు చూడండి
భారతదేశం, ఆగస్టు 9 -- బోనాల జాతర ఉత్సవాలు, ఊరేగింపుల సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ఆగస్టు 9, 10 తేదీల్లో విస్తృత స్థాయి ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. అంతేకాకుండా భద్రతా కారణ దృష్ట్యా నగరంలోని పలు ప్రాంతాల్లో మద్యం షాపులను మూసివేయాల్సిందిగా పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
సింహవాహిని శ్రీ మహంకాళి లాల్ దర్వాజా బోనాల ఉత్సవాల సందర్భంగా ఆగస్టు 9న ఉదయం 6 గంటల నుంచి, అలాగే ఆగస్టు 10న ఉదయం 9 గంటల నుంచి ఊరేగింపులు పూర్తయ్యే వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. చార్మినార్, లాల్ దర్వాజా, అలియాబాద్, నాగులచింత, గౌలీపురా, ఛత్రినాక, మొఘల్ పురా, హరిబౌలి, నయాపూల్ పరిసరాల్లోని పలు రహదారులను పూర్తిగా మూసివేయడం లేదా మళ్లించడం జరుగుతుంది.
మదీనా ఎక్స్ రోడ్స్ నుంచి గుల్జార్ హౌస్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.