భారతదేశం, జూలై 5 -- ఆషాఢ బోనాల మహోత్సవాలలో భాగంగా జూలై 16 నుంచి హైదరాబాద్‌లోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో(డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం పక్కన) రాష్ట్ర స్థాయి హస్తకళల ప్రదర్శనతోపాటుగా అమ్మకాలను ప్రభుత్వం నిర్వహించనుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఎస్‌ఈఆర్‌పీ(SERP) ఆధ్వర్యంలో గ్రామీణాభివృద్ధి శాఖ నిర్వహిస్తోంది. జూలై 16న ప్రారంభమయ్యే బోనాల ఉత్సవాలను ఘనంగా, సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. చారిత్రాత్మక గోల్కొండ కోటలోని శ్రీ జగదంబ మహంకాళి ఆలయంలో ఈ వేడుకలు జులై 16న ప్రారంభమవుతాయి.

గత ఏడాదితో పోలిస్తే ఎక్కువ మంది కళాకారులకు తమ ఉత్పత్తులను ప్రదర్శించి, జీవనోపాధి పొందేందుకు అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం అధిక సంఖ్యలో స్టాళ్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. బోనాల పండుగకు అవసరమైన అన్ని రకాల ...