భారతదేశం, ఫిబ్రవరి 17 -- లైఫ్ సైన్సెస్ రంగానికి సంబంధించి హైదరాబాద్‌లో పెట్టుబడులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రంగంలో హైదరాబాద్ కేంద్రంగా ఇప్పటికే అనేక సంస్థలు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను ఏర్పాటు చేశాయని పారిశ్రామిక వేత్తలకు వివరించారు. హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్టాత్మక బయో ఆసియా 2026 ప్రపంచస్థాయి సదస్సు ప్రారంభమైన సందర్భంగా ముఖ్యమంత్రి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు.
జీవవైజ్ఞానిక రంగంలో జీసీసీలు, ముఖ్యంగా ఇన్నొవేషన్ సెంటర్ల ఏర్పాటుకు అనుగుణంగా భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రత్యేకమైన జోన్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ సంకల్పించారు. దిగ్గజ కంపెనీల భేటీ సందర్భంగా పెట్టుబడులకు సంబంధి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.