భారతదేశం, సెప్టెంబర్ 28 -- Bigg Boss Telugu 10 September 27 Episode: తెలుగు బుల్లితెర రియాలిటీ షో రోజుకోపుంతలు తొక్కుతోంది. ఊహించని వ్యూహాలతో అటు ఆడియెన్స్‌కు ఇటు కంటెస్టెంట్స్‌కు ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తోంది బిగ్ బాస్ తెలుగు 10 సీజన్.

బిగ్ బాస్ 10 తెలుగులోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా వచ్చిన మిథిలేష్ రెడ్డి రూ. 15 లక్షలు తీసుకుని హౌజ్ నుంచి బయటకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఇదంతా శనివారం (సెప్టెంబర్ 26) నాటి ఎపిసోడ్‌లో జరిగింది. మిథిలేష్ వెళ్లగానే హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

ఇక ఆదివారం నాటి బిగ్ బాస్ తెలుగు 10 సెప్టెంబర్ 27 ఎపిసోడ్‌లో ఎప్పుడు నిర్వహించే ఎలిమినేషన్ విధానాన్ని అమలుపరిచాడు హోస్ట్ నాగార్జున. ఒక్కొక్కరుగా సేవ్ అవుతూ ఎలిమినేషన్ గండం నుంచి తప్పించుకున్నారు. చివరికి ఇద్దరు మిగిలి ఆ తర్...