భారతదేశం, ఏప్రిల్ 19 -- Sonali Raut About Bigg Boss Marathi 6: టెలివిజన్ రియాలిటీ షో 'బిగ్ బాస్' అంటేనే వివాదాలకు కేరాఫ్ అడ్రస్. అయితే ఈసారి బిగ్ బాస్ మరాఠీ 6వ సీజన్ తీవ్ర విమర్శల పాలవుతోంది. నటి సోనాలి రౌత్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన ఒక వీడియో ఇప్పుడు ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది.

ఆ వీడియోలో సోనాలి రౌత్ శరీరంపై ఉన్న ఎర్రటి దద్దుర్లు, స్కిన్ ఇన్‌ఫెక్షన్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 17న షేర్ చేసిన ఈ వీడియో చూసి అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. హౌస్‌లో ఉన్నప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే తన పరిస్థితి ఇలా తయారైందని సోనాలి ఆరోపించారు.

బిగ్ బాస్ హౌస్ బయటకి కనిపించేంత కలర్‌ఫుల్‌గా లోపల లేదని సోనాలి రౌత్ కుండబద్దలు కొట్టారు. ప్రేక్షకులు టీవీలో చూసేదానికి, వాస్తవానికి చాలా తేడా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. వంటింట్లో ఎలుకలు...