భారతదేశం, సెప్టెంబర్ 20 -- Nora Fatehi About Participating In Bigg Boss : బాలీవుడ్‌తో పాటు గ్లోబల్ వైడ్‌గా తన డాన్స్ స్టెప్పులతో ఊపేస్తున్న హాట్ బ్యూటీ నోరా ఫతేహి పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది ఆమె గ్లామర్, ఎనర్జీ. ప్రైవేట్ ఆల్బమ్స్, పాపులర్ ఐటమ్ సాంగ్స్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ కెనడియన్ బ్యూటీ, కెరీర్ ప్రారంభంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

టీవీ హిస్టరీలోనే అతిపెద్ద రియాలిటీ షో 'బిగ్ బాస్'లోకి అడుగుపెట్టడం వెనుక ఓ పెద్ద డ్రామానే ఉందంటూ తాజాగా నోరా ఫతేహి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఓ పాడ్‌కాస్ట్‌లో 'అన్‌ట్రిగ్గర్డ్' సంభాషణలో పాల్గొన్న నోరా ఫతేహి తన కెరీర్ ప్రారంభ రోజుల నాటి చేదు అనుభవాలను పంచుకున్నారు.

"నేను కొన్ని పాటలు చేసినప్పటికీ నిర్మాతలు నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వలేదు. ఏజెన్సీలకు ...