భారతదేశం, మే 25 -- Bhumi Pednekar Reacts To Obscene Wall Painting: మహిళల భద్రత, సమాజంలో వారిపై జరుగుతున్న అన్యాయాలపై బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ మరోసారి గళమెత్తారు. దేశంలో చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు, కట్న వేధింపుల మరణాలు కలవరపెడుతున్న తరుణంలో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వికృత వీడియోపై భూమి తీవ్రంగా స్పందించారు.

భోపాల్‌లో ఇటీవల కట్న వేధింపులు తట్టుకోలేక 33 ఏళ్ల నటి ట్విషా శర్మ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దారుణంపై ఇప్పటికే కంగనా రనౌత్ వంటి తారలు స్పందిస్తూ, పెళ్లయిన తర్వాత కూతుళ్లను పుట్టింటి వారు పట్టించుకోకుండా వదిలేసే సామాజిక పోకడలను తప్పుబట్టారు. ఈ వివాదం కొనసాగుతుండగానే, యువత వికృత మనస్తత్వాన్ని బయటపెట్టే మరో వీడియో వెలుగులోకి వచ్చింది.

'ట్యూబ్ ఇండియన్' అనే ఇన్‌స్టాగ్రామ్ ప...