భారతదేశం, మే 27 -- Bhoot Bangla OTT: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar), లెజెండరీ దర్శకుడు ప్రియదర్శన్ (Priyadarshan) కాంబినేషన్‌లో వచ్చిన హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ 'భూత్ బంగ్లా' (Bhooth Bangla) బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ సాధించింది. 'ఓ మై గాడ్ 2', 'ధురంధర్: ది రివెంజ్' చిత్రాల తర్వాత అక్షయ్ కుమార్‌కు ఈ సినిమా రూపంలో ఒక పక్కా కమర్షియల్ హిట్ దక్కింది. థియేటర్లలో విడుదలైన నెల రోజులు దాటినా ఇంకా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న ఈ చిత్రం.. త్వరలోనే ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

భారీ అంచనాల మధ్య విడుదలైన 'భూత్ బంగ్లా' థియేటర్లను మళ్లీ కళకళలాడేలా చేసింది. ఈ సినిమా సాధించిన వసూళ్ల వివరాలు చూస్తే.. ఇండియాలో నెట్ వసూళ్లు రూ.175 కోట్లుగా ఉన్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ వసూళ్ల విషయానికి వస్తే ఇవి రూ.240 కోట్లు కావడం ...