భారతదేశం, ఆగస్టు 17 -- విజయనగరం జిల్లా భోగాపురంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణికుల రాకపోకలను మరింత సులభతరం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌పోర్ట్ ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి 30 నిమిషాలకు ఒక 'ఏరో ఎక్స్‌ప్రెస్' ఏసీ బస్సు సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారి ఆర్‌ఎమ్‌బీ అప్పలనాయుడు వెల్లడించారు.

మొదటి ఏరో ఎక్స్‌ప్రెస్ సర్వీస్ పాత గాజువాక నుంచి ఉదయం 04:55 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ బస్సు ఎయిర్‌పోర్ట్ మీదుగా మద్దిలపాలెం వైపు ప్రయాణిస్తుంది. ఇదే రూట్‌లో చివరి బస్సు సేవ రాత్రి 07:45 గంటలకు బయలుదేరుతుంది. రోజంతా ప్రతి 30 నిమిషాలకు ఒక ఏరో ఎక్స్‌ప్రెస్ ఏసీ బస్సు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.

విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు అందు...