భారతదేశం, ఆగస్టు 17 -- ఉత్తరాంధ్ర అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించిన 'అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం' నుంచి సోమవారం (ఆగస్టు 17) పౌర విమాన రాకపోకలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో (IndiGo) సంస్థకు చెందిన తొలి విమానం ఈ రన్‌వేపై విజయవంతంగా ల్యాండ్ కావడంతో ఈ అంతర్జాతీయ విమానాశ్రయ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్వయంగా విమానాశ్రయానికి చేరుకుని తొలి విమాన సర్వీసులను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ప్రయాణికులకు బోర్డింగ్ పాస్‌లను అందజేసి వారి ప్రయాణానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. "అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో వాణిజ్య విమాన సర్వీసుల...