భారతదేశం, మార్చి 26 -- భద్రాచలానికి మహర్దశ వచ్చేసింది.! ఇక పట్టణంతో పాటు ఆలయ రూపురేఖలు మారనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయగా..మొత్తం రూ. 586 కోట్లతో అభివృద్ధ పనులు చేపట్టాలని నిర్ణయించింది. 3 విడతల్లో ఈ నిధులను ఖర్చు చేయనుంది. ఈ క్రమంలో మొదటి విడత పనుల కోసం రూ. 351 కోట్లు మంజూరు అయ్యాయి.ఈ మేరకు బుధవారం పరిపాలనాపరమైన అనుమతులు మంజూరయ్యాయి.
మొదటిదశలో గోదావరి ఘాట్ అభివృద్ధి, ఆలయ పరిసరాల విస్తరణ, మౌలిక వసతుల మెరుగుదల వంటి పనులు చేస్తారు. ఇందులో గోదావరి ఘాట్‌కు రూ.75 కోట్లు, ఆలయ సముదాయానికి రూ.180 కోట్లు, పరిసరాల అభివృద్ధికి రూ.96 కోట్లు కేటాయించారు. రెండో దశలో ఆలయం సమీపంలో అభివృద్ధి పనులు, మూడో దశలో భద్రాచలం పట్టణ సమగ్ర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ సహజత్వానికి ఏమాత్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.