భారతదేశం, మార్చి 20 -- గోదావరి నదిలో విషాదం చోటు చేసుకుంది. స్నానానికి వెళ్లిన ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ ఘటన భద్రాచలం సరిహద్దు ప్రాంతం కూనవరంలో జరిగింది. గల్లంతైన వారిలో ఇద్దరి మృతదేహాలు లభ్యం కాగా. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ప్రాథమిక వివరాల ప్రకారం.. అమరావతిలోని ఓ ఇంజినీరింగ్‌ కాలేజీలో చదువుతున్న ఏడుగురు విద్యార్థులు కూనవరం రోడ్డులోని గోదావరి నదిలో స్నానాలు చేసేందుకు దిగారు. నది లోతు తెలియకపోవటంతో. ప్రమాదవశాత్తూ ఐదుగురు విద్యార్థులు మునిగిపోయారు. మరో ఇద్దరు మాత్రమే ఒడ్డుకు చేరుకున్నారు.

ఒడ్డుకు చేరుకున్న విద్యార్థులకు స్థానికులతో పాటు పోలీసులకు వెంటనే సమాచారం అందించారు. స్థానికులు బోట్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టగా.. ఇద్దరి మృతదేహాలు లభ్యమ్యాయి. వీరిని శ్రీకర్ (భద్రాచలం), అభిరామ్ (భద్రాచల...